సత్యసాయి: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. సాయి కుల్వంత్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేద పండితులు శాస్త్రోక్తంగా పంచాంగ శ్రవణం చేశారు. కొత్త ఏడాదిలో వర్షాలు, పంటలు, దేశాభివృద్ధి తదితర అంశాలను భక్తులకు వివరించారు. భక్తి గీతాలాపనతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.