TPT: శ్రీకాళహస్తి మండలంలో ప్రమాదాలకు గురవుతున్న బ్లాక్ స్పాట్ ప్రాంతాలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. కేఆర్డీ పెట్రోల్ బంక్ నుంచి స్వర్ణముఖి బ్రిడ్జి వరకు ఉన్న బ్లాక్ స్పాట్‌ను జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు పరిశీలించారు. రహదారి భద్రత మెరుగుపరిచే చర్యలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.