ASF: పోలీస్ శాఖలో విధి నిర్వహణలో ఉండగా మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా ప్రభుత్వం నిలుస్తుంది. గురువారం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కారుణ్య నియామకాల కింద ఎంపికైన ఐదుగురు అభ్యర్థులకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నియామక పత్రాలను SP నితికా పంత్ అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిజాయితీతో ఉద్యోగం చేయాలని సూచించారు.