VZM: దత్తిరాజేరు మండలం పెదమానాపురంలో శుక్రవారం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఈ మేరకు సచివాలయ సిబ్బంది గ్రామంలో ఇంటింటికి వెళ్లి మిస్సైన పేర్లను నమోదు చేస్తున్నారు. ఈ సర్వే వల్ల ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందుతాయని, కుటుంబ ప్రయోజన కార్డు పొందుతారని VRO కార్తికేయ తెలిపారు.