CTR: చిత్తూరు జిల్లాలో జరుగుతున్న జనగణన కార్యక్రమాన్ని ఈనెల 26వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. జనగణన పురోగతిపై బుధవారం సాయంత్రం అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇండ్ల గణన కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, ప్రగతి చూపించని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.