విశాఖపట్నంలో చైతన్య స్రవంతి సంస్థ ఆధ్వర్యంలో HPV వ్యాక్సిన్ శిబిరం నిర్వహించారు. జీవీఎంసీ శానిటరీ కార్మికుల కుమార్తెలలో 9-14 ఏళ్ల మధ్య వయస్సు గల 50 మందికి పైగా బాలికలకు ఉచితంగా టీకాలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ షిరీన్ రహమాన్ మాట్లాడుతూ.. గర్భాశయ క్యాన్సర్ నియంత్రణకు హెచ్పీవీ వ్యాక్సిన్ కీలకమని తెలిపారు.