కృష్ణా: వల్లభనేని వంశీ తనపై సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్‌లో అసత్య ప్రచారం జరుగుతోందని తెలిపారు. గురువారం ఆయన గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దుష్ప్రచారం చేస్తున్న వారి ఆధారాలను వంశీ పోలీసులకు సమర్పించారు. వీడియో మార్ఫింగ్ చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.