CTR: పుంగనూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ వెంకటేశులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీకాం, బీకాం కంప్యూటర్, బీఏ పొలిటికల్ సైన్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు. అనేక సౌకర్యాలతో పాటు NCC, NSSలో కూడా విద్యార్థులు చేరవచ్చని పేర్కొన్నారు.