GNTR: రాజధాని అమరావతి పరిధిలోని 42 శ్మశాన వాటికల అభివృద్ధికి అధికారులు అనుమతులు మంజూరు చేశారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని ఈ పనుల కోసం సీఆర్డీయే (CRDA) నిధులు రూ. 51 కోట్లు కేటాయించారు. శ్మశాన వాటికలతో పాటు గ్రామాల్లో మౌలిక వసతులు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాన్ని కూడా వేగంగా పూర్తి చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.