NZB: అమెరికా-ఇరాన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ దేవరకొండలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి మాట్లాడుతూ.. సామ్రాజ్యవాద యుద్ధాల వల్ల పెరిగిన చమురు ధరలతో ప్రజలు సతమతమవుతున్నారని కేంద్రం అమెరికాకు లొంగిపోవడం వల్లే ఈ దుస్థితి అని విమర్శించారు. నిరసనలో స్థానిక సీపీఐ నేతలు పాల్గొన్నారు.