AKP: నర్సీపట్నంలోని 18వ శతాబ్దం నాటి చారిత్రాత్మక శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని కల్యాణోత్సవం నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను టీడీపీ పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్ శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉదయం 7 గంటలకు స్వామి వారి తిరువీధి మహోత్సవం ఉంటుందన్నారు.