అన్నమయ్య: జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ వివాదాలు, సైబర్ నేరాలు, మహిళల వేధింపులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోలీసులు బాధ్యతగా పనిచేస్తారని ఎస్పీ తెలిపారు.