ASR: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈనెల 13న అల్లూరి జిల్లాలో పర్యటించనున్నట్లు సమాచారం. పాడేరు మండలం నందిగురువులో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఉప ముఖ్యమంత్రి పర్యటన ఇంకా అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు ఆయన సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు సమాచారం.