ASR: పోలవరం జిల్లాల్లోని 22 మండలాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన డివిజన్ స్థాయి అధికారులకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఆయా మండలాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యేలా ఈ అధికారులు పర్యవేక్షిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.