ATP: పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్ను తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఇవాళ తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు గురించి సీఐ రామసుబ్బయ్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నేరాల సమీక్ష నిర్వహించి గంజాయి కట్టడి, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై దిశానిర్దేశం చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.