SKLM: నూతనంగా ఎంపికైన పోలీసు కానిస్టేబుళ్లకు అందిస్తున్న శిక్షణ విధానాలను ఎస్పీ మహేశ్వర రెడ్డి ఇవాళ పరిశీలించారు. ఈ మేరకు ఎస్పీ తండేవలస జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని సందర్శించి, శిక్షణా ప్రక్రియ అమలు పై ఆరా తీశారు. శిక్షణా కార్యక్రమాలు నాణ్యతతో, క్రమ శిక్షణతో నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు.