అన్నమయ్య: మదనపల్లె కలెక్టరేట్లో నిర్వహించిన PGRSకు జిల్లా వ్యాప్తంగా 388 అర్జీలు వచ్చినట్లు జాయింట్ కలెక్టర్ నారాయణ శర్మ అన్నారు. అర్జీలను వేగంగా, నాణ్యతగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పింఛన్, రేషన్ కార్డు సమస్యలపై పలువురు వినతులు సమర్పించారు. అన్ని సమస్యలను గడువులోగా పరిష్కరించాలంటూ.. సంబంధిత శాఖలకు సూచనలు జారీ చేశారు.