SDPT: జగదేవపూర్ మండలం గొల్లపల్లి – బీ.జీ. వెంకటాపూర్ ప్రధాన రహదారి అధ్వానంగా మారిందని స్థానికులు తెలిపారు. రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడటంతో ప్రయాణం నరకప్రాయమవుతుందన్నారు. అటు అంబులెన్స్‌లు రాక, పంటలు తరలించలేక రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేపట్టి, రవాణా కష్టాలను తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.