HNK: హసన్ పర్తి మండలంలోని ట్రైనింగ్ సెంటర్లో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల కింద 76 మంది లబ్ధిదారులకు రూ. 76,08,816 విలువైన చెక్కులను ఇవాళ MLA KR నాగరాజు పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాల ప్రయోజనం చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.