MDK: హౌసింగ్ సెన్సస్ బ్లాక్ లిస్టును పక్కాగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో సిబ్బందికి వచ్చే సందేహాల నివృత్తి కోసం తొమ్మిది మంది అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జనగణన ప్రక్రియలో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలన్నారు.