AP: అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్రం రంగం సిద్ధం చేసింది. రూ.2,534 కోట్లతో ఈ నిర్మాణం చేపట్టనుంది. డీపీఆర్ సిద్ధం చేసి కేంద్ర కేబినెట్ ఆమోదానికి CPWBD పంపింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరనున్నాయి. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి CRDA 22.53 ఎకరాలు కేటాయించింది. పదెకరాల్లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ను హుడ్కో నిర్మిస్తుంది.