ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వరుడు పుష్పాల ప్రత్యేక అలంకరణలో భక్తులకు కనువిందు చేశాడు. సోమవారం ఉదయాన్నే స్వామి మూల విరాట్‌కు పురోహితులు రామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. బ్రహ్మోత్సవ వేడుకలు కన్నుల పండుగలా కొనసాగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుంటున్నారు.