ప్రకాశం: జరుగుమల్లి మండలం చిరుకూరపాడులో ఉపాధి హామీ పనులకు బుధవారం మంత్రి స్వామి భూమిపూజ నిర్వహించారు. మండలంలో ఉపాధి హామీ పథకం అమలు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పనికి వచ్చే వారికి వేసవిలో ఎండలు అధికంగా ఉన్నందున వారికి తగు సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజబాబు, మండల నాయకులు పాల్గొన్నారు.