అన్నమయ్య: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైల్స్ దగ్ధం కేసులో కీలక నిందితులుగా ఉన్న మునితుకారాం, మాధవరెడ్డిలను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసు ప్రారంభం నుంచి విదేశాలకు వెళ్లిపోయి, తిరిగి వచ్చిన వీరిని చంద్రగిరి నియోజకవర్గం గాదంకి టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.