E.G: రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు సేవించి అస్వస్థతకు గురైన బాధితులను ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు PVN మాధవ్ సోమవారం పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు తక్షణమే అప్రమత్తమై సమగ్ర విచారణ చేపట్టాలని సూచించారు.