NLR: ఆత్మకూరు పట్టణ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సరికొత్త మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు మంత్రి ఆనం ప్రకటించారు. నెల్లూరులో అధికారులతో సమీక్షించారు. రహదారుల విస్తరణ, సీసీ రోడ్లు, మురుగు కాలువలు, తాగునీటి సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రతి వార్డు సమానంగా అభివృద్ధి చెందేలా దీర్ఘకాలిక ప్రణాళికతో పౌరసేవలు అందించాలని ఆదేశించారు.