VSP: జీవీఎంసీ సౌత్ జోన్ పరిధిలోని షాపు రూములు, మార్కెట్లు, కళ్యాణ మండపాలను మూడేళ్ల లీజుకు ఇచ్చేందుకు వేలం నిర్వహించనున్నారు. సూర్య బాగ్ జోనల్ కార్యాలయంలో జూన్ 9న ఉదయం 11 గంటలకు వేలం జరుగుతుందని జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు తెలిపారు. డైక్స్ ట్యాంక్, జగదాంబ, పద్మానగర్, తదితర వాణిజ్య సముదాయాలతో పాటు మూడు మార్కెట్లు, రెండు కళ్యాణ మండపాలను వేలంలోకి తెచ్చారని పేర్కొన్నారు.