ప్రకాశం: హనుమంతునిపాడు మండల తహసీల్దార్ రమణారావు శుక్రవారం మండలంలో నిర్వహించిన రీ-సర్వే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంబంధిత ప్రాంతాలను పరిశీలించి, పనుల పురోగతిని తెలుసుకున్నారు. రీ-సర్వే ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. అలాగే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.