ప్రకాశం: IPL సందర్భంగా క్రికెట్ బెట్టింగ్‌పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. పొదిలి ఎస్సై సూరెడ్డి రాజేష్ మాట్లాడుతూ.. బెట్టింగ్‌లో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో పొదిలిలో గాలింపు ముమ్మరం చేసి హోటళ్లు, లాడ్జీలు, టీ దుకాణాల్లో నిఘా పెట్టారు. ఒకసారి కేసు నమోదైతే భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు.