కోనసీమ: ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామంలో జరగనున్న శ్రీ ధనమ్మ తల్లి, పల్లాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల గోడపత్రికలను అమలాపురంలోని క్యాంప్ కార్యాలయం వద్ద మంగళవారం అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆవిష్కరించారు. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆయన కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.