KRNL: కర్నూల్లోని బంగారుపేటలో మంగళవారం నాటుసారా స్థావరాలపై పోలీసు & ఎక్సేంజ్ అధికారులు కలిసి విస్తృత దాడులు నిర్వహించారు. ఈ మేరకు 65 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో 1350 లీటర్ల నాటు సారా బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటు సారా తయారీకి కారకులైన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నాటు సారా కాయడం చట్టరీత్య నేరమన్నారు.