PLD: దాచేపల్లి మండలం మాదినపాడులో నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు పదికి పైగా విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలు ఇళ్ల రేకులు కొట్టుకుపోగా, రోడ్లపై పెద్ద సంఖ్యలో చెట్లు కూలడంతో స్థానికులు భయాందోళన చెందారు. రహదారులపై పడిన చెట్లను వెంటనే తొలగించి, రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.