నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేసింది. వీరసింహారెడ్డి సినిమా విడుదలైన తొలిరోజే రూ.25 కోట్ల వరకూ షేర్ ను సాధించింది. దీంతో బాలయ్య కెరీర్ లోనే ఇదే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.
Moment of the day ??
The GOD OF MASSES is entertaining the crowd with his singing ??
తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నల గడ్డ అతిథులుగా విచ్చేశారు. ఈ వేడుకలో స్టేజ్ పై బాలయ్య పాట పాడి అందర్నీ హుషారెత్తించాడు. స్టేజీపై బాలయ్య పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.