స్టార్ హీరోయిన్ సమంత పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’లో నటిస్తోంది. ఫిబ్రవరి 17వ తేదిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ పౌరాణిక ప్రేమ కావ్యంగా ‘శాకుంతలం’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజువల్ వండర్‌తో పాన్ ఇండియా ప్రేక్షకులను ఈ సినిమా మెస్మరైజ్ చేయనుంది.
ఈ మూవీ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, ‘మల్లికా మల్లికా..’ సాంగ్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా ‘శాకుంతలం’ సినిమా నుంచి ‘ఋషి వనంలోన…’ పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి మ్యూజిక్ ను అందిస్తున్నారు. సిద్ శ్రీరామ్, చిన్మయి ఎంతో శ్రావ్యంగా ఈ పాటను ఆలపించారు. శ్రీమణి ఈ పాటను సాహిత్యాన్ని అందించారు.