ELR: మార్చి నెల పెన్షన్ను ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 28వ తారీఖున పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ వెట్రి సెల్వి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,57,658 మంది పింఛన్ దారులకు 113.09 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 28వ తేదీన తీసుకోని వారికి 2న పంపిణీ చేస్తారన్నారు.