WGL: పర్వతగిరి మండలం చింతనెక్కొండ క్రాస్ వద్ద గురువారం వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్సై ప్రవీణ్ బృందం, విజ్ఞాన భారతి విద్యాలయానికి చెందిన TS 15 UA 44496 స్కూల్ బస్సును ఆపి తనిఖీ చేసింది. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడుపుతున్నట్లు గుర్తించి, అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.