KMM: ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. బహుజన విప్లవ వీరుడు పాపన్న గౌడ్ ఆశయాలను స్మరించుకుంటూ నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.