ప్రకాశం: ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో బెట్టింగ్లకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రజలకు సూచించారు. బెట్టింగ్లకు అలవాటు పడి యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని హెచ్చరించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాల వల్ల కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఆర్థికంగా దెబ్బతిని రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడతాయని ఆయన తెలిపారు.