KKD: ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయం వద్ద “స్వచ్ఛ రథం”ను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాలను ప్లాస్టిక్ వ్యర్థాలు, కాలుష్య రహితంగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్లాస్టిక్ ఇనుము వంటి వస్తువులను తీసుకుని నిత్యవసర వస్తువులు అందజేస్తారన్నారు.