MLG: హైదరాబాదు నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ములుగు కలెక్టర్ దివాకర పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ, వార్డు సభలు సమర్థవంతంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సూచనలను జిల్లాలో కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు.