NGKL: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో భూగర్భ జలాల పరిరక్షణకు జిల్లాలోని ప్రతిఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని జిల్లా భూగర్భ జల అధికారి దివ్యజ్యోతి సూచించారు. నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాలలో భవిష్యత్లో నీటిలభ్యత క్షీణించకుండా ఉండాలంటే వర్షపునీటిని నేలలోకి చొరబడేలా ప్రతి ఒక్కరూ ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.