SRD: నారాయణఖేడ్ ఆర్టీసీ బస్టాండ్లో డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మహిళా ప్రయాణికులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 290 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని, తద్వారా వారు దాదాపు 10 వేల కోట్ల రూపాయలను ఆదా చేసుకున్నారని వెల్లడించారు.