BDK: యువత ర్యాష్ డ్రైవింగ్తో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, క్రమశిక్షణతో వాహనాలు నడపాలని మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి సూచించారు. మంగళవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.