SRD: హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యా వసతులు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు అందుతుందన్నారు.