BHPL: కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం చతుర్దశి పర్వదినం పురస్కరించుకుని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతినెల నిర్వహించే పూజా కార్యక్రమాల్లో భాగంగా అర్చకులు నాగరాజు గ్రామ దేవతలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.