AP: సీఎం చంద్రబాబు రేపు నెల్లూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. వింజమూరులో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయాన్ని సందర్శించి, స్వామివారికి సీఎం దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.