VSP: గాజువాకలో శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సమ్మర్ తరగతులు ప్రారంభమయ్యాయని ఆలయ ఛైర్మన్ దొడ్డి రమణ, ధర్మకర్త మంత్రి మంజుల మంగళవారం తెలిపారు. 6-18 సంవత్సరాల పిల్లలకు సనాతన ధర్మంపై అవగాహన కలిపించేందుకు ఏప్రిల్ 5 నుంచి 45 రోజులు పాటు తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విష్ణుసహస్ర నామం, భగవతగీత, రామాయణం, మంత్ర ధ్యానం, తదితర అంశాలపై ఉంటాయన్నారు.