ADB: భగవాన్ మహావీర్ చూపించిన అహింస, సత్యం మార్గంలో పయనించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం పట్టణంలోని రాణిసతిజీ కాలనీలో నిర్వహించిన మహావీర్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. జైన్ సమాజం పరిమాణంలో చిన్నదైనప్పటికీ, వారు పాటించే సూత్రాలు దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు.