MHBD: బయ్యారం మండలంలో మద్యం వ్యాపారులు సిండికేట్గా మారి ఎమ్మార్పీ కంటే రూ. 30-50 అదనంగా వసూలు చేస్తున్నారని సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య రవి నాయక్ ఇవాళ ఆరోపించారు. మండలంలోని సుమారు 250 బెల్టు షాపులకు తెల్లవారుజామునే అక్రమంగా మద్యం సరఫరా అవుతోందని పేర్కొన్నారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.