NZB: బోధన్ లయన్స్ క్లబ్ భవనంలో మంగళవారం నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో సీపీ సాయి చైతన్య పాల్గొన్నారు. ఏప్రిల్ 2న పట్టణంలో జరగనున్న వీరహనుమాన్ విజయయాత్రను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో, శాంతియుతంగా జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం సీపీ మారుతి మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.